Skip to main content

Namaste NRI

ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది : నాగార్జున

అనీష్‌ హీరోగా మహేష్‌ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మిస్తున్న చిత్రం ఇట్లు అర్జున. అగ్ర నటుడు అక్కినేని నాగార్జున సమర్పణలో ఈ సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్‌ నచ్చడంతో గ్లింప్స్‌కి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను. కొత్త టాలెంట్‌ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను. ఇప్పటికే మా అన్నపూర్ణ సంస్థలో చాలా మంది కొత్తవారిని పరిచయం చేశాం. ఈ సినిమా చూశాను. బాగా నచ్చింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరించడానికి ముందుకొచ్చాను. ఈ సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది అన్నారు.

తొలి సినిమాతోనే హీరో అనీష్‌ మూగవాడి పాత్రను చేస్తూ ప్రయోగానికి సిద్ధమయ్యారని, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించారని నాగార్జున ప్రశంసించారు. హృద్యమైన ప్రేమకథ ఇదని, కథలోని ములుపులు ఉత్కంఠను పంచుతాయని నిర్మాత వెంకీ కుడుముల తెలిపారు. దర్శకుడిగా తన తొలి చిత్రం నాగార్జునగారి సమర్పణలో విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శకుడు మహేష్‌ అన్నారు. ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events