కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. సాయి మంజ్రేకర్ కథానాయిక. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు.అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అగ్ర హీరో ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ స్టేజ్‌పై విజయశాంతిగారు మాట్లాడుతుంటే నాన్నగారు లేని లోటు తీరిపోయింది. హీరోలకు ధీటైనా కథానాయిక ఈ దేశంలో విజయశాంతి గారు మాత్రమే. కర్తవ్యం లోని వైజయంతి పాత్రకు కొడుకు పుడితే ఎలా ఉంటుందో అదే ఈ కథ. ఈ సినిమా చూశాను. విజయశాంతిగారు లేకపోతే సినిమా లేదు. పనిచేసిన వారంతా ప్రాణం పెట్టారు. సినిమా ఆఖరి 20 నిమిషాలు గుండె పిండేసింది. చూస్తున్న నాకే కన్నీళ్లు ఆగలేదు. ఆ 20 నిమిషాలు అలా రావడానికి కారణం మా అన్నయ్య కల్యాణ్‌రామ్. ఆయన కెరీర్‌లో ఈ సినిమా స్పెషల్‌గా నిలిచిపోతుంది అని అన్నారు.

ఇది థియేటర్ నుంచి బయటకు రాగానే మరిచిపోయే సినిమా కాదు. రోజుల తరబడి గుర్తిండిపోయే సినిమా అని హీరో కల్యాణ్‌రామ్ అన్నారు. అగ్ర నటి విజయశాంతి మాట్లాడుతూ ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీ. ఓ తల్లి పడే ఆరాటం, కొడుకు చేసే పోరాటం, తల్లీకొడుకుల మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా. నిర్మాణంలో ఉండగానే ఈ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయి. అనుకున్నట్టే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం అని నమ్మకం వెలిబుచ్చారు.
