Namaste NRI

ఆ హోదా నాకు ఇష్టం లేదు : మెగాస్టార్

తెలుగు సినీ పరిశ్రమ గురించి చెలరేగుతోన్న వివాదాల గురించి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హైదరాబాద్‌ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో సినీ కార్మికులకు హెల్త్‌ కార్డుల పంపిణీ కోసం నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ పెద్దరికం అనే హోదా తనకు ససేమిరా ఇష్టం లేదని చెప్పారు. పెద్దగా ఉండను కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని అన్నారు. అవసరం వచ్చినప్పుడు నేను ఉన్నాంటూ ముందుకు వస్తానని చెప్పారు. అనవసరమైన వాటికి ముందు కొచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరం ఉన్నప్పుడు నా భజం కాయాలనుకున్నప్పుడు వస్తానని హామీ ఇచ్చారు. ఇద్దరు కొట్టుకుంటుటే తగువు తీర్చమంటే నేను తీర్చనని ఆయన అనడం గమనార్హం.  పరిశ్రమ  సమగ్ర అవసరాల కోసమైతే ముందుకు వస్తానని తెలిపారు. సిని పరిశ్రమకు పెద్ద అనిపించుకోవడం నాకు ఇబ్బంది వ్యాఖ్యానించారు. తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఎవరూ లేరని, ఆ బాధ్యత చిరంజీవి తీసుకోవాలని సినీ కార్మికులు కోరగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రతి ఒక్కరి జీవితాలపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆరోగ్యం ఎంతో ప్రధానమైనదని సుస్పష్టంగా తెలిసి వచ్చిందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని సినీ కార్మికుల జీవితాలను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events