బ్రిటన్ జాత్యహంకార దేశం కాదని తాను వంద శాతం నమ్ముతున్నానని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అన్నారు. లాథ్వియా రాజధాని రీగాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్‌ను జాత్యహంకార దేశంగా పిలవడాన్ని ఆయన ఖండిరచారు. భారత సంతతికి చెందిన తాను బ్రిటన్‌కు మొదటి ప్రధాని అయ్యానని, తాను ఈ మాట చెప్పడం వల్ల కచ్చితంగా ప్రభావం ఉంటుందని అన్నారు. మనదేశ సంస్కృతి, పోరాటపటిమ, అందం చూసి నేను గర్విస్తున్నా అని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)