అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఓ రాత్రి తనకు చేదు అనుభవం ఎదురైందని నటి మారియా ఫార్మర్ వెల్లడించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్ కార్యాలయంలో ఒక రోజు రాత్రి ట్రంప్ తనను అదోలా చూశారని ఆమె ఆరోపించారు. ఎప్‌స్టీన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డ సమయంలో ఒక రాత్రి ట్రంప్ తనకు ఆయన ఫోన్ చేశారని మారియా చెప్పారు.

అర్జెంటుగా ఆఫీస్‌కు రమ్మనడంతో నైట్ డ్రెస్‌లోనే తాను ఆయన దగ్గరకు వెళ్లానని మారియా చెప్పారు. అప్పటికే ఎప్‌స్టీన్ కార్యాలయంలో ఉన్న ట్రంప్ తన శరీరాన్ని అదోలా చూశారని, తాను షార్ట్స్ ధరించడంతో కాళ్లవైపే చూస్తూ ఉండిపోయారని చెప్పారు. ఈ ఘటన 1995లో జరిగిందని, అప్పుడు తన వయసు 20 ఏళ్లు ఉంటుందని మారియా తెలిపారు. ట్రంప్ తన కాళ్లవైపే చూస్తుండగా అక్కడికి వచ్చిన ఎప్‌స్టీన్ అది చూసి, నోనో ఆమె నీకోసం కాదు అని ట్రంప్‌తో చెప్పారని తెలిపారు. కాగా జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కుంభకోణానికి సంబంధించిన ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలని అమెరికావ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.















