భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీతో తనకు మంచి స్నేహబంధం ఉందని తెలిపారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయన చాలా తెలివైన వ్యక్తి. గ్రేట్ ప్రైమ్ మినిస్టర్. మోదీ ఇటీవలే యూఎస్ పర్యటకు వచ్చారు. మా మధ్య మంచి చర్చలు జరిగాయి. అవి ఇరుదేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా. కానీ, ఆ దేశంతో నాకు ఉన్న ఏకైక సమస్య ఒకటే. అది సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించే దేశాల్లో భారత్ ఒకటి. అయితే, సుంకాలను వారు గణనీయంగా తగ్గిస్తారని నేను నమ్ముతున్నా. ఏప్రిల్ 2న యూఎస్ దిగుమతులపై ఎంత సుంకాలు విధిస్తే, నేను కూడా వారి నుంచి అంతే వసూలు చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు.
