రాజమౌళి తాజాగా హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టివెన్ స్పిల్ బర్గ్‌ను కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమం కోసం జక్కన్న రాజమౌళి, కీరవాణిలు కటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్ధరూ యూనివర్సల్ పార్టీలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టివెన్ స్పిల్ బర్గ్‌ను కలసి.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఇదే విషయాన్ని రాజమౌళి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడే నేను దేవుడ్ని కలిశాను అంటూ స్టివెన్ స్పిల్ బర్గ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నాడు. గాడ్ ఆఫ్ మూవీస్‌గా అభివర్ణించే స్పిల్‌బర్గ్‌ను కలిశాను.. ఆయన సినిమాలంటే నాకెంత ఇష్టమో అని తనకు చెప్పినట్లు తెలిపాడు.
