పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ది గోట్ లైఫ్ (ఆడు జీవితం). బ్లెస్సీ దర్శకత్వం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ర్టాల్లో విడుదల చేస్తున్నది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ 90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి కథ ఇది. అక్కడ ఆయన సంక్షుభిత జీవన ప్రయాణాన్ని ఆవిష్కరిస్తూ సాగుతుంది అన్నారు. 2018లో షూటింగ్‌ను ప్రారంభించి, లాక్‌డౌన్ వంటి ఎన్నో అవాంతరాలను దాటుకొని ఈ సినిమాను పూర్తిచేశాం. కథలో హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ఈ సినిమా కోసం తొలుత బరువు పెరిగి, ఆ తర్వాత 31కిలోలు తగ్గాను. బరువు తగ్గేందుకు ఒక షెడ్యూల్ తర్వాత ఏడు నెలల గ్యాప్ తీసుకున్నా అన్నారు. ఈ నెల 28న విడుదలకానుంది.