సాయికుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల నటీనటులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాతో నేను సినిమా ఆరంభమైంది. ఎల్లాలు బాబు టంగుటూరి సమ్పరణలో ప్రశాంత్ టంగూటూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్ని వేశానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చారు. ఆది సాయికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి అన్నారు. కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న అనుభావాల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నానని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.














