Namaste NRI

కళింగ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ఎంపీ రఘునందన్ రావు

స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం కళింగ. బిగ్‌హిట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ నిర్మిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  రఘునందన్ రావు మాట్లాడుతూ ఎవరు ఎంత బిజీగా ఉన్నా, రోజంతా ఉన్న అలసటను తీర్చుకోవడానికి సినిమాలు చూడటం అనేది మన కల్చర్‌లో భాగం. కరోనా తరువాత అందరూ ఓటీటీకి అలవాటు పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా ప్రయోగాలు వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ చూస్తే భయ పెట్టించేలా ఉన్నాయి. ఈ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను తీసిన ధృవ, నిర్మాతలకు మంచి లాభాలను రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

 హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ ఈ సినిమా చూసిన చాలా మంది కాంతార, విరూపాక్ష తరహాలో ఉంటుందా? అని అడుగుతున్నారు. కానీ ఇదొక కొత్త కాన్సెప్ట్‌. ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తుంది అన్నారు. తెరపై విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని నిర్మాతలు దీప్తి కొండ వీటి, పృథ్వీ యాదవ్‌ తెలిపారు. ఈ సినిమా టీజర్‌ చూసి భయపడ్డానని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన హీరో తిరువీర్‌ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులందరూ మట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events