సంతోష్ శోభన్, ఫల్గుణి ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ. సుభాష్ చంద్ర దర్శకుడు. ఎం.ఆర్.ప్రొడక్షన్స్ పతాకంపై సృజన్ ఎరబోలు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను అగ్ర దర్శకుడు క్రిష్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ట్రావెల్ నేపథ్యంలో సంగీత భరితంగా సాగే కథ ఇది. ఇండియా మొత్తం చూసినట్లుగా ఉంటుంది. మనసుకు హాయిని పంచుతూ ఆద్యంతం నవ్విస్తుంది. ఆయనకు పెద్ద సక్సెస్ రావాలి. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులను కూడా జోరుగా హుషారుగా షికారు పోదమ అనేలా తీసుకెళ్తారని అనుకుంటున్నాను అని అన్నారు. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో ఆహ్లాదభరిత ప్రేమకథగా మెప్పిస్తుందని హీరో సంతోష్ శోభన్ తెలిపారు. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయిక ఫల్గుణి తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిసంతోష్, సంగీతం: నాగవంశీ.
