చాలా కాలం తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ హనీరోజ్. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో అలరించింది. మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న టైమ్‌లో బాలయ్యతో నటించే చాన్స్ కొట్టేసింది. బాలకృష్ణకు తల్లిగా, భార్యగా రెండు పాత్రల్లో వైవిధ్య నటనను కనబరిచి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాతో హనీరోజ్‌కు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఈ భామ తాజాగా ఓ శుభవార్త చెప్పింది. పెళ్లికి సిద్ధంగా ఉన్నానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత, ఆ బాధ్యతకు తను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఎమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. మంచి వరుడుకోసం వెతుకుతున్నానని పేర్కొంది. ప్రస్తుతం మాలీవుడ్‌కే పరిమితమైన ఈ వయ్యారి మళ్లీ తెలుగు సినిమాల వైపు ప్రయత్నాలు చేస్తోంది.