Skip to main content

Namaste NRI

పోటీ నుంచి తప్పుకోను.. నాపై వ్యతిరేక ప్రచారం ఆపండి

ఒక పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడు జో బైడెన్‌ తప్పుకుంటారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. దానికి తోడు అయన అభ్యర్థిత్వం వదులుకోవాలంటూ సొంత పార్టీలోనే నిరసన గళాలు అధికం అవుతున్నాయి. తానే డెమోక్రాటిక్‌ అభ్యర్థిగా రంగంలో ఉంటానని ఇప్పటికే స్పష్టం చేసిన బైడెన్‌ ఇలాంటి ప్రచారానికి ముగింపు పలకాలని పార్టీ వర్గాల వారికి మరోసారి గట్టిగా చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన పార్టీ సహచరులకు రెండు పేజీల లేఖ రాసారు.అందరూ ఏకంగా ఈ ఎన్నికల్లో ముందుకెళ్తూ ట్రంప్‌ ఓటమికి కృషి చేయాలని ఆయన కోరారు.

Social Share Spread Message

Latest News