Namaste NRI

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. నిర్మాత అశోక్ కుమార్

నిహాల్‌, ప్రియా దేశ్‌ పాగ్‌, అర్జున్‌దేవ్‌, కాజల్‌ తివారి తదితరులు ముఖ్యతారలుగా రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సందిగ్ధం. పార్ధసారధి కొమ్మోజు దర్శకుడు. సంధ్య తిరువీధుల నిర్మాత. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నిర్మాత అశోక్‌కుమార్‌ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఇది ఆద్యంతం ఆకట్టుకునే కొత్త కథ. నా భార్య సంధ్య నన్ను నిర్మాతగా నిలబెట్టాలని ప్రేమతో చేసిన ప్రయత్నం ఇది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది అని దర్శకుడు పార్థసారధి చెప్పారు. త్వరలో విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News