Skip to main content

Namaste NRI

హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాను : మహిమా నంబియార్

శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా కామ్రేడ్ కళ్యాణ్. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం. ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పి స్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మహిమా నంబియార్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిమా నంబియార్‌ మీడియాతో మాట్లాడారు. ఇందులో నా పాత్రపేరు సితారదేవి. ఒరిస్సా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తా. పక్కింటి అమ్మాయి తరహా పాత్ర. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది అని అన్నారు. శ్రీవిష్ణు స్పాంటేనిటీ ఉన్న నటుడు. ఆయనతో కలిసి నటించడం గొప్ప అనుభవం. నిజానికి ఆయనతో సామజవరగమనా లోనే చేయాల్సింది. ఆ సినిమా కోసం ఫొటో షూట్‌ కూడా జరిగింది.కానీ కొన్ని కారణాలవల్ల కుదర్లేదు. ఇప్పుడు ఆయనతోనే కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది అని మహిమా సంతోషం వెలిబుచ్చింది.

ఈ సినిమా చాలా ఫన్‌గా ఉంటుందని, 90ల నేపథ్యంలో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందని, ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ సినిమాలో నక్సలిజం నేపథ్యం కూడా ఉంటుందని, దాన్ని కూడా కామికల్‌గా డీల్‌ చేశారని మహిమా నంబియార్‌ తెలిపింది. తెలుగులో మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఉందని, ప్రస్తుతం తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తున్నానని మహిమా చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events