Skip to main content

Namaste NRI

ఐ బొమ్మ సినిమా ట్రైలర్‌ లాంచ్‌

బానోత్‌ పవన్‌, గౌతమ్‌, నర్మద, సతీశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఐ బొమ్మ. విజయ్‌ రఘునాథభట్ల దర్శకుడు. కురువ జమన్న నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన నిర్మాతలు రామసత్యనారాయణ, రాజా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

ఆసక్తికరమైన కథతో ఈ సినిమా రూపొందుతున్నదని నిర్మాత కురవ జమన్న తెలిపారు. జీవితంలో అనేక సంఘర్షణలకు లోనైన వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగు వేశాడు? అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది? అతని ఆలోచన వెనుక ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఐ బొమ్మ అని, ఒక్క రాత్రిలో స్క్రిప్ట్‌ పూర్తి చేసి, 15రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశామని, త్వరలోనే రిలీజ్‌కు తెస్తున్నామని దర్శకుడు విజయ్‌ రఘునాథభట్ల చెప్పారు. ఇంకా నటులు బానోతు పవన్‌, గౌతమ సతీశ్‌ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ మరుకుర్తి, సంగీతం: హనుమ ప్రసాద్‌ యాళ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events