ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అంతేకాకుండా, చెక్కు ద్వారా జరిగే లావాదేవీలకు సంబంధించిన పెనాల్టీను కూడా పెంచుతున్నట్టు చెప్పింది. క్యాష్ డిపాజిట్లు, బ్యాంక్ సేట్‌మెంట్, పాస్‌బుక్ సంబంధించి డూప్లికేట్ సర్టిఫికేట్‌ల జారీ, తదితర సేవలన్నిటికీ చార్జీలు పెంచుతున్నట్టు పేర్కొంది.