Skip to main content

Namaste NRI

ఇడుపు కాయితం విడుదల.. షూటింగ్ స్టార్ట్ కాకముందే రిలీజ్ డేట్ అనౌన్స్

అచ్చ తెలంగాణ మాండలికమైన ఇడుపు కాయితం అనే మాటను టైటిల్‌గా పెట్టి రూపొందిస్తున్న ఇడుపు కాయితం చిత్రం ముహూర్తం రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇందులో జానపద గీతాలతో సుపరిచితురాలైన నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రియదర్శి హీరోగా తెలంగాణ నేపథ్య కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వంశీ రెడ్డి దొండపాటి దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ వెలువడింది.

త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించి, డిసెంబర్‌ తొలివారంలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. శివజ్యోతి (తీన్మార్‌ సావిత్రి), జోర్దార్‌ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అజయ్‌ బేతిగంటి, మైమ్‌ మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నిర్మాణం: సుకుమార్‌ రైటింగ్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌, నిర్మాత: బన్నీ వాస్‌, దర్శకత్వం: వంశీ దొండపాటి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events