Skip to main content

Namaste NRI

అమెరికా తప్పుకుంటే… ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: జో బైడెన్

నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మ‌రోసారి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్ త‌ల‌ప‌డనున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు అధినేత‌లు జోరుగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తు న్నారు. ఈ సంద‌ర్భంగా డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిం చారు. ప్రపంచాధినేతగా అమెరికా ఉండాల్సిన అవసరం లేదని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను బైడెన్ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యంగా అమెరికా లేకపోతే మరి ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు.

ట్రంప్‌ కోరుకున్నట్లే అమెరికా ప్రపంచ వేదికపై నుంచి తప్పుకుంటే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తారు? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫ్లోరిడాలో మాట్లాడిన జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని టంపాలోని హిల్స్‌బరో కమ్యూనిటీ కాలేజీలో జరిగిన ప్రచార కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తన గెలుపును కోరుకుంటున్నాయని చెప్పారు. జీ7, జీ20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు మీరే గెలవాలని తనతో చెప్పారని పేర్కొన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికావైపే చూస్తోందని అన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే, ఈ ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపైనే అందరూ దృష్టి సారించారని బైడెన్ చెప్పుకొచ్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events