అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఐస్‌క్రీమ్స్ అంటే మహా ఇష్టం అని పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. చాలా సార్లు బైడెన్ ఐస్‌క్రీం తింటూ కనిపించారు కూడా. అయితే, తాజాగా ఐస్‌క్రీంపై తనకున్న ప్రేమను బైడెన్ మరోసారి బయటపెట్టారు. వైట్‌హౌస్‌లో జరిగిన ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం మొదటి వార్షికోత్సవంలో పాల్గొన్న బైడన్ ఈ సందర్భంగా మాట్లాడారు. తనకు నిజంగా గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు తెలుసునని వ్యాఖ్యానించారు. కావాలంటే పిల్లలు తనని సంప్రదిస్తే సాయం చేస్తానంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పిల్లలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఇక్కడ కొన్ని గొప్ప ఐస్‌క్రీం ప్రదేశాలు తెలుసు. మీకూ కావాలంటే నాతో మాట్లాడండి సాయం చేస్తాను అంటూ చమత్కరించారు.
