భారతీయులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న హెచ్-1బీ వీసా జారీ విధానాన్ని సమూలంగా మార్చుతానని అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి చెప్పారు. తాను అధికారంలోకి వస్తే లాటరీ విధానానికి స్వస్తి చెప్పి, దాని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని ప్రవేశపెడుతా నని పేర్కొన్నారు. ప్రస్తుత విధానం కంపెనీలకే ప్రయోజకరంగా ఉన్నదని చెప్పారు.ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న వివేక్ ప్రచార దశల్లో పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ రేస్‌లో బలీయ గుర్రంగా నిలిచారు. వచ్చే ఏడాది అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతాయి. భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన కార్యాచరణ ప్రకటనతో భారతీయ ఐటి ప్రొఫెషనల్స్ గుండెల్లో ప్లేను పరుగెత్తించారు.అమెరికాలో ఉద్యోగాలకు ఇండియన్ ఐటి యువత ఎక్కువగా ఈ తాత్కాలిక వీసా ఉద్యోగ విధానం హెచ్ 1 బి వీసాపైనే ఆధారపడుతున్నారు.
