ఉక్రెయిన్ కోసం ఈ జూన్‌లో శిఖరాగ్ర శాంతి సదస్సు నిర్వహణకు స్విట్జర్లాండ్ సిద్ధమైంది. అయితే, ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ గైర్హాజరు కావడమనేది రష్యా అధినేత పుతిన్ కు పరోక్షంగా ఘన స్వాగతం పలికినట్లేనని పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సదస్సుకు అనేక మంది ప్రపంచ నేతలు హాజరవుతున్నారు. బైడెన్ కూడా పాల్గొనడం అవసరం. ఒకవేళ ఆయన రాకపోతే, అది పుతిన్‌ను ప్రశంసించినట్లు అవుతుంది. వ్యక్తిగతంగా స్టాండిరగ్ ఒవేషన్ ఇచ్చి నట్టే అని బ్రెస్సెల్స్ పర్యటన సందర్భంగా జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని దాటవేసే దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధంతో సంతృప్తి చెందినట్టేనని వ్యాఖ్యానించారు.