రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ యుద్ధం జరిగేదే కాదని, ఒకవేళ వచ్చినా 24 గంటల్లో ముగించేసేవాడినని ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నది యుద్ధమే కాదన్నారు ట్రంప్. ఈ వివాదాన్ని తాను అమెరికా అధ్యక్షుడి ఉండి ఉంటే 24 గంటల్లో సమసిపోయేలా చేసి ఉండేవాడినని చెప్పారు. భవిష్యత్‌లో మిలియన్ సంవత్సరాల్లో ఎన్నడూ జరగకుండా చూసేవాడినని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ట్రంప్ తప్పుపట్టారు. అమెరికాలో తయారైన అబ్రామ్స్ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపాలని జోబైడెన్ నిర్ణయం తీసుకోవడం శుద్ధ తప్పని పేర్కొన్నారు. ఈ చర్య రష్యాను రెచ్చగొట్టే చర్యగా పరిగణించబడుతున్నదన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి నిలుస్తున్నట్లు ఇటీవలనే ట్రంప్ ప్రకటించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)