ధన్య బాలకృష్ణ, చైతన్యరావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం జగమే మాయ. సునీల్ పుప్పాల దర్శకత్వం వహించారు. ఉదయ్ కోలా, శేఖర్ అన్నే నిర్మాతలు. ఈ సినిమా విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యరావు మాట్లాడుతూ బలమైన కథ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరోమారు రుజువు చేసింది చిత్రం. ప్రేక్షకుల నుంచి ఇలాంటి సహకారం అందితే మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయన్నారు. అనంతరం నిర్మాత ఉదయ్ కోలా మాట్లాడుతూ కథదే ఈ విజయం. దర్శకుడు సునీల్ మంచి స్క్రిప్ట్‌తో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అన్ని భాషల నుంచీ మంచి స్పందన లభిస్తోంది అన్నారు. సునీల్ పుప్పాల మాట్లాడుతూ ఉదయ్‌గారు నన్ను బలంగా నమ్మారు. ప్రేక్షకుల ఆదరణ గొప్ప ఆనందాన్ని ఇస్తోంది అన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ ఉప్పాల, తేజ ఐనంపూడి తదితరులు పాల్గొన్నారు.
