అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఆర్య చిత్రం ఒక మైలురాయి. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు.. ఆర్య లేకపోతే నేను లేను. ఇప్పుడు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను అని హీరో అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్లో జరిగిన పుష్ప థ్యాంక్స్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా థ్యాంక్స్ మీట్ కచ్చితంగా పెడతాను. ఎందుకంటే ఫలితంతో సంబంధం లేకుండానే ఏ సినిమాకైనా కష్టం ఒక్కటే ఉంటుంది. మా సినిమాను ఇంత బాగా ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులు, సినీ అభిమానులుకు థ్యాంక్ అన్నారు.
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ అల్లు అర్జున్ నాకు దేవుడు లాంటి వాడు. ముఖంలోనే అని భావాలు పలికించగల గొప్ప నటుడు. అలాంటి నటుడు దొరకడం అదృష్టం అన్నారు. పుష్ప సినిమా ఇప్పటి వరకు 285 కోట్లు వసూలు చేసింది. జవనరి 6 వరకు ప్రపంచవ్యాప్తంగా 325 కోట్లకుపైగానే కలెక్ట్ చేస్తుందనే నమ్మకం ఉంది అన్నారు నిర్మాతలు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిని చిత్రం పుష్ప. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ఈ నెల 17న విడుదలైంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.