
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులలో అనిశ్చితి నెలకొంటోంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని కోరుతూ అమెరికన్ కాంగ్రెస్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి అమెరికాలో చదువుకుంటున్న భారతీయుల సంఖ్య 28 శాతం క్షీణించింది. అంతర్జాతీయ విద్యార్థులు ప్రత్యేకంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాన్వేషణ కోసం మూడేళ్లపాటు అమెరికాలో నివసించేందుకు ఓపీటీ ప్రోగ్రామ్ అనుమతిస్తుంది. అయితే ఓపీటీని రద్దు చేయాలని కోరుతూ ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్ యాక్ట్ 2025 పేరిట కొత్త బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
