
తనను అమరుడిగా మార్చాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు తెలిసింది . శాస్త్రవేత్తలు ఆ పనిచేసి పెడితే రష్యాను ఎప్పటికీ ఏలేయాలన్నది పుతిన్ కల కావొచ్చు. జీవ గడియారాన్ని వెనక్కి తిప్పడం గురించి ఏం చేశారని జూన్‌లో రష్యా ఆరోగ్య శాఖ వైద్యులు, పరిశోధకులకు లేఖ రాసిన విషయాన్ని డెయిలీ మెయిల్ గుర్తుచేసింది. అయితే అమరత్వాన్ని ప్రసాదించే దివ్యౌషధాన్ని తయారు చేసేందుకు కొన్ని సంవత్సరాలు, బిలియన్ల కొద్దీ ఖర్చవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
