ధృవ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్. ఎ.పి.అర్జున్ దర్శకుడు. ఉదయ్ కె.మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మాతలు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ హీరో అర్జున్ సర్జా, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ఈ మూవీ చూడండి. నాకు టాలెంట్ ఉందని అనుకుంటే, ఆ తర్వాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి అని ధృవ సర్జా అన్నారు. ఈ సినిమా విజయంపై నిర్మాత ఉదయ్ కె.మెహతా నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కథానాయిక వైభవి శాండిల్య కూడా మాట్లాడారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.