Namaste NRI

ఇలాంటి సినిమాలు  వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు : దిల్‌ రాజ్‌

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం మసూద.  సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా  విజయోత్సవాన్ని పురస్కరించుకుని దిల్‌ రాజు మాట్లాడుతూ  ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమా తీయాలనుకునే సంకల్పం ఉన్న వాళ్లకి తప్పకుండా మంచి ఫలితాలు దక్కుతాయన్నారు.  మసూద, లవ్‌టుడే, హిట్‌2 వరుసగా మూడు విజయాలు వచ్చాయి. పరిశ్రమకి మళ్లీ మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది అన్నారు. మంచి సినిమాలకు సీజన్‌ అంటూ ఏమీ ఉండదని, ఇలాంటి  మంచి సినిమాలు వస్తే ప్రేక్షకలు అదరిస్తారని మసూద మళ్లీ ఫ్రూవ్‌ చేసిందన్నారు.   ఈ కార్యక్రమంలో   ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, రాజ్‌ కందుకూరి, బెక్కం  వేణుగోపాల్‌, లగడపాటి శ్రీధర్‌, హీరో సుమంత్‌, సుహాస్‌, సందీప్‌, రాజ్‌, శుభలేఖ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events