Skip to main content

Namaste NRI

అలా చేస్తే ఆ రెండు దేశాల‌కు మంచిది కాదు

ఇరాన్‌కు చైనా, రష్యా దేశాలు ఎలాంటి ఆయుధాలు విక్రయించకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అలా చేస్తే అది ఆ రెండు దేశాల ప్రయోజనాలకు మంచిది కాదని అన్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్‌కు ఆయా దేశాలు ఆయుధాలు అందించడం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇరాన్‌కు చైనా, రష్యా దేశాలు లక్ష్యాన్ని నిర్ధారించుకునే సమాచారాన్ని అందిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
మే నెలలో బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వం అని ఆయన హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. తమ మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఆ మాటను తాను విశ్వసిస్తున్నానన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఇదే హామీ ఇచ్చారని ట్రంప్‌ వెల్లడించారు. తాము ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు విక్రయించడం లేదని, నాటో దేశాలకు మాత్రమే అమ్ముతున్నామ‌ని చెప్పారు. అవి తర్వాత ఎలా పంపిణీ అవుతున్నాయో తనకు తెలియదని ట్రంప్ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events