చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తోంది.మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. కీర్తిసురేశ్ చిరంజీవి సోదరిగా నటిస్తోంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. కోల్‌కతా నేపథ్యంలో మొదలైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, వినోదం అంశాల కలబోతగా ఆకట్టుకుంది. అమ్మాయిల మిస్సింగ్ కేసులను ఛేదించడానికి భోళా శంకర్ ఎంట్రీ ఇవ్వడం.. అనంతరం వచ్చిన యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. నీ వెనక మాఫియా ఉంటే.. నా వెనుక దునియా ఉంది బే..’ అంటూ చిరంజీవి తనదైన స్టైల్‌లో చెబుతున్న డైలాగ్స్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. మెగా అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్ మెంట్ ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది.ఈ చిత్రంలో సుశాంత్, రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, రావు రమేశ్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, సంగీతం: మహతి స్వరసాగర్, నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, స్క్రీప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.