Namaste NRI

పరిస్థితి ఇలాగే కొనసాగితే.. జపాన్ కనిపించకపోవచ్చు!

 జపాన్‌లో  జననాల రేటు గణనీయంగా పడిపోతున్నాయి. మరోవైపు మరణాల రేటు పెరిగిపోతోంది. జపాన్ జనాభా క్షీణత ఇంతే వేగంగా కొనసాగితే భవిష్యత్తులో తమ దేశం కనుమరుగు కావచ్చని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదా సహాయకురాలు మసాకో మోరీ హెచ్చరించారు. 2022లో జపాన్‌లో జన్మించిన వారి కంటే రెట్టింపు మంది మరణించారని తెలిపారు. జనన రేటు పతనాన్ని తగ్గించకపోతే, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశం కనిపించకుండా పోతుందని హెచ్చరించారు. 2008లో 128 మిలియన్లు ఉన్న జపాన్ జనాభా 124.8 మిలియన్లకు పడిపోయింది. జనాభా క్షీణత రేటు పెరుగుతుండటంతో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఏడాది జపాన్‌లో ఎనిమిది లక్షల జననాలు రికార్డు కాగా, మరణాలు మాత్రం 115.8 లక్షలు నమోదయ్యాయి. 2008 నుంచి ప్రస్తుతానికి జపాన్ జనాభా 4 కోట్లు తగ్గిపోయింది. జపాన్‌లో  జనాభా పెరుగుదల కనిపించడం లేదనే చెప్పాలి. పనిచేసే యువత భవిష్యత్తులో లేకుంటే పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దెబ్బతినే అవకాశం ఉంటుంది. సామజిక వ్యవస్థ కుప్పకూలవచ్చు. జపాన్‌లో  జనాభా క్షీణతకు తగు ప్రణాళికలు చేపట్టి అరికట్టాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events