ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడికి సంబంధించిన పది మంది నిందితుల ఫోటోలను ఎన్ఐఎ వెలువరించింది. వీరికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సమాచారం తెలిసినా వెంటనే తమకు తెలియచేయాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. సంబంధిత నిందితుల చిత్రాలను పొందుపరుస్తున్నామని, వీరి గురించి జాడ తెలిస్తే చెప్పండి లేదా తగు సమాచారం ఉంటే తెలియచేయండని నియా తమ ప్రకటనలో కోరింది. ఇది ప్రాధాన్యతతో కూడిన సమాచారం అవుతుందని, దాడికి పాల్పడ్డ వారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు వీలేర్పడుతుందని ఎన్ఐఎ తెలిపింది. సమాచారం ఇచ్చిన వారి ఉనికి గోప్యత పరిరక్షణ జరుగుతుందని కూడా వివరించారు. కాన్సులేట్‌పై అప్పటి దాడికి కెనడాలోని ఖలీస్థానీ ఉగ్రవాదులకు సంబంధం ఉందని ప్రాధమికంగా తెలిసింది.
