ఈ ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోటీపడుతున్నారు. ఇప్పటికే అయోవా కాకస్ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి జోరుమీదున్నారు. మరో వైపు రిపబ్లికన్ పార్టీ తరఫున భారతీయ అమెరికన్ నిక్కి హేలి సైతం అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల సమయం లో రాజధాని వాషింగ్టన్‌లో జనవరి 6న జరిగిన అల్లర్లను అరికట్టడంలో నిక్కి హేలి విఫమయ్యారని ట్రంప్ ఆరోపించగా, నిక్కి హేలి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్‌కు మానసిక స్థితి సరిగా లేదన్నారు. అల్లర్ల సమయంలో వాషింగ్టన్‌లో లేనన్నారు.
గతంలో జోబైడెన్ వయసుపై ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్‌పై సైతం నిక్కి హేలి ఆ వ్యాఖ్యలే చేస్తున్నారు. దేశం గజిబిజిగా మారుతున్న సమయంలో 80 సంవత్సరాల ఇద్దరు వృద్ధులను అధ్యక్ష పదవికి పోటీపడడాన్ని నిజంగా చూడాలనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. ఇద్దరు పోటీలో ఉంటే రిగ్గింగ్, అరాచకం ఉంటుందని ఫలితాలు వారికే అనుకూలంగా ఉంటాయని ఆరోపించారు.