ఐరోపాలోని రాజధాని నగరాలపై అణాయుధాలు ప్రయోగించి, కేవలం రెండు నుంచి 3 నిమిషాల్లో సరనాశనం చేయగలమని, మరోమాటలో చెప్పాలంటే భూమ్మీద ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతుదారులు హెచ్చరించారు. పారిస్, లండన్, బెర్లిన్ వంటి నగరాలతో సహా పశ్చిమ దేశాల ఆనవాళ్లు కూడా మిగలవని బెదరించారు. ఒకే ఒక సర్మత్ ఖండాంతర క్షిపణితో బ్రిటన్కు చెందిన ఐల్స్ అంతర్థానమవుతుందని అన్నారు. ఐరోపా దేశాలపై ఏ క్షణమైనా లేదా మే 9 నాటికి రష్యా అధ్యక్షుడు యుద్ధం ప్రకటించవచ్చని, ఉక్రెయిన్పై పూర్తిస్థాయిలో దాడులు చేసే ప్రమాదం ఉందని, దానిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ఐరోపా దేశాలు సిద్ధం కావాలని నాటో మాజీ చీఫ్ రిచర్డ్ షరీప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)