Namaste NRI

దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు

అమెరికాపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐఆర్‌జీసీ) తన మాటల దాడిని ఉధృతం చేసింది. ఇరాన్‌ను ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ముందు చాలా పరిమితమైన, క్లిష్టమైన దారులు ఉన్నాయని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. సాధ్యంకాని ఆపరేషనా లేక ఇరాన్‌తో ఒక చెడ్డ ఒప్పందమా అన్న దాంట్లో ఒకదాన్ని ట్రంప్‌ ఎంచుకోవాలని ఐఆర్‌జీసీ నిఘా విభాగం  తెలిపింది. ఈ హెచ్చరిక రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఆ ప్రాంతంలో అమెరికా సైనిక ఒత్తిడి విషయంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తున్నది.

 ట్రంప్‌ ఒక అసాధ్యమైన సైనిక చర్య లేదా ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇరాన్‌తో ఒక చెడ్డ ఒప్పందం మధ్య ఎంచుకోవాలి. అమెరికాకు నిర్ణయం తీసుకునే అవకాశాలు తగ్గిపోయాయి అని పేర్కొన్నది. అంతేగాక, ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా విధించిన నావికా దిగ్బంధాన్ని ముగించడానికి ఇరాన్‌ ఒక గడువు విధించిందని తెలిపింది. అయితే అందుకు కచ్చితమైన కాలపరిమితిని ఐఆర్‌జీసీ పేర్కొనలేదు. అమెరికా పట్ల చైనా, రష్యా, యూరప్‌ వైఖరిలో మార్పు వస్తున్నదని, ఇది పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని సూచిస్తున్నదని కూడా ఐఆర్‌జీసీ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events