Namaste NRI

గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం :  హర్ష

హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్‌. కల్యాణ్‌ సంతోష్‌ దర్శక త్వం. ఈ చిత్రాన్ని హీరో రవితేజ, సుధీర్‌కుమార్‌ నిర్మించారు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన హర్ష కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుందని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా విషయంలో చిరంజీవిగారు ఇచ్చిన సపోర్ట్‌ మరచిపోలేను. పదేళ్ల క్రితం ఆడియెన్స్‌ మధ్యలో ఉన్నాను . ఇప్పుడు ఈ స్టేజీ మీద ఉన్నాను. మనం గట్టిగా నమ్మితే ఏదైనా సాధించగలం అని హర్ష చెముడు అన్నారు. వినోదంతో పాటు చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు కల్యాణ్‌ సంతోష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రం ఈ  నెల 23న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events