తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ప్రయత్నిస్తే అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరుద్ఘాటించారు. చైనా ఆక్రమణ నుంచి అమెరికా బలగాలు, ప్రజలు తైవాన్‌ను రక్షిస్తారని పేర్కొన్నారు. స్వాతంత్య్రానికి సంబందించి తైవాన్ ప్రజలే సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వతంత్రంగా ఉండాలంటూ వారిని మేం ప్రోత్సహించం అని అన్నారు. తైవాన్‌ను ఆక్రమించుకునే హక్కు చైనాకు లేదన్నారు. ఉక్రెయిన్ పై దాడికి పాల్పడ్డ రష్యా పరిస్థితే చైనాకు పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. తైవాన్ అంశం శాంతియుతంగా పరిష్కారం కావాలన్నదే తమ విధానమని అనంతరం వైట్‌హౌస్ పేర్కొంది. ఈ విషయంలో తమ వైఖరి యథాతథమని తెలిపింది. అయితే, తైవాన్ విషయంలో సైనిక జోక్యంపై స్పందించలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)