
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్‌లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది. తమ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన హమాస్, హెజ్బొల్లా, హౌతీ తదితర సంస్థలను సమర్థించిన వారికీ తాజా హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపింది. మా దేశానికి వచ్చి యూదు వ్యతిరేక హింసకు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వాలనుకొనేవారు మరోసారి ఆలోచించుకోండి. మీకు మేం ఇక్కడ స్వాగతం పలకం అని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ అన్నారు. తాజా నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
