ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా నటిస్తున్న సినిమా టాప్ గేర్. ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు కె. శశికాంత్ రూపొందించారు. ఆదిత్యమూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలోశ్రీధనలక్ష్మిప్రొడక్షన్స్ బ్యానర్ పైరూపొందిస్తుంది. ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ నన్ను బాగా ఆకట్టుకుంది. ఇందులో నేను క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించాను. ఒక రోజులో సాగే కథ ఇది. ఓ మధ్యతరగతి కుర్రాడు తనకు సంబంధం లేని సమస్యలో ఇరుకుని దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. పేరుకు తగినట్లే సినిమా కథనం టాప్ గేర్ లో వెళ్తుంది. సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఆకర్షణ అవుతుంది. కేజీఎఫ్ వచ్చాక మాస్ సినిమాలంటే అర్థం మారిపోయింది. ప్రేక్షకులు ఆ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను ఇష్టపడుతున్నారు. చేస్తే అలాంటి సినిమాలు చేయాలి. ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటించను. కొత్త కథలు ఎంచుకోవాలని, ప్రయోగాత్మక సినిమాల్లో నటించాలని ఉంది. అన్నారు.ఈ నెల 30న ఈ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)