
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్ తనను చంపితే ఆ దేశాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తమ నాయకుడిని చంపితే భీకర యుద్ధాలు తప్పవని ఇరు దేశాల నాయకులు పరస్పరం హెచ్చరికలు జారీచేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిని అంతం చేస్తామంటూ ఇరాన్ చేసిన హెచ్చరికలపై ట్రంప్‌ని విలేకరులు ప్రశ్నించగా తనకేమైనా జరిగితే ఇరాన్‌ను భూమి నుంచే పూర్తిగా తుడిచివేయాలని తాను ఇప్పటికే తమ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ట్రంప్ తెలిపారు.















