కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రివాల్వర్ రీటా. జేకే చంద్రు దర్శకుడు. జగదీష్ పళనిస్వామి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. రీటా ఓ మధ్యతరగతి అమ్మాయి. చాలా ధైర్యవంతురాలు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొంటుంది. గన్స్‌తో పాటు ఆయుధాలను వాడటంలో మంచి ప్రావీణ్య ఉంటుంది. ఇంతకి ఆ అమ్మాయి నేపథ్యం ఏమిటి? తను పోలీసా? లేకా అండర్‌వరల్డ్ ఏజెంటా? ఈ విషయాలన్ని తెలియాలాంటే రివాల్వర్ రీటా సినిమా చూడాల్సిందే అంటున్నది చిత్ర బృందం.
ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత రాజేష్ దండా సొంతం చేసుకున్నారు. హాస్యమూవీస్ పతాకంపై ఆయన తెలుగు రాష్ర్టాల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో భిన్న పార్శాలుంటాయని, రివాల్వర్ రీటా అసలు లక్ష్యమేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. రాధిక శరత్‌కుమార్, రెడిన్ కింగ్ల్సీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సీన్ రోల్డాన్, దర్శకత్వం: జేకే చంద్రు.