Namaste NRI

కష్టపడితే తప్పకుండా ఫలితం :  బ్రహ్మానందం

సోహైల్‌ హీరోగా శ్రీ కోనేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం బూట్‌కట్‌ బాలరాజు. ఎం.డి.పాషా నిర్మాత. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానందం కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, సోహైల్‌ నటనలో చక్కటి పరిణితి కనబరుస్తున్నాడని ప్రశంసించారు. సినిమా కథ చాలా కొత్తగా ఉందని మంచు మనోజ్‌ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలున్న చిత్రమిది. సోహైల్‌ ఈ కథను తన భుజాలపై మోశాడు. భీమ్స్‌ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది అన్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయని నిర్మాత ఎం.డి.పాషా తెలిపారు.  ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events