Namaste NRI

ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు : డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏం చేసినా సంచలనమే అవుతుంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌,  తన పాలన ఎలా ఉంటుందో మరోసారి అందరికీ రుచిచూపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు  కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను మూడోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో తాను జోక్‌ చేయడం లేదని వ్యాఖ్యానించారు.

ఇంటర్వ్యూలో భాగంగా మరోమారు అధ్యక్షుడు కావాలనుకుంటున్నారా? అందుకు ఏమైనా వ్యూహాలున్నాయా? అన్న ప్రశ్న ట్రంప్‌కు ఎదురైంది. ఇందుకు ఆయన సమాధానమిస్తూ, రాజ్యాంగం అనుమతించకపోయినా,  మూడోసారి అధ్యక్షుడు కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు. నన్ను మూడోసారి కూడా అధ్యక్షుడిగా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే, దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటే అవుతుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు అని ట్రంప్‌ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events