హీరో హవీష్, దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ నేను రెడీ. కావ్య థాపర్ హీరోయిన్. ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న నేను రెడీ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో హవీష్ మాట్లాడుతూ నేను రెడీ మూవీతో త్రినాథరావుతో సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఇది బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అన్నారు.

డైరెక్టర్ నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ నేను రెడీ మూవీలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులతో కళకళగా ఉంటుంది. షూటింగ్ మొత్తం ఒక పండగలా చేస్తున్నా. పది సీన్స్ చేస్తే 8 సీన్స్ బాగా నవ్వుకుంటుంటున్నాం. 2 సీన్స్ సెంటిమెంట్‌తో ఉద్వేగానికి గురవుతున్నాం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. కుటుంబం మధ్యలో ఉండే సరదాలు, ఎమోషన్స్‌తో మూవీ ఆకట్టుకుంటుంది. ఇదొక ఫ్యామిలీ బొనాంజా మూవీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ కావ్య థాపర్, ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు, విక్రాంత్ శ్రీనివాస్, ప్రవీణ్ పూడి, గోపరాజు రమణ, హరితేజ, మహతి, జయవాణి, మాణిక్ రెడ్డి, రూప లక్ష్మి, రోహన్ రాయ్, బలగం సత్యనారాయణ పాల్గొన్నారు.
