తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో ప్రవాసాంధ్రులు నిరసన ప్రదర్శన చేపట్టారు. యువకులు, టీడీపీ సానుభూతిపరులు, ఐటీ ఉద్యోగులు, పెద్దఎత్తున పాల్గొన్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాలతో ఉద్యోగాలు కల్పించడం నేరమా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
