మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన విద్యాప్రమాణాల వల్లే తాము విదేశాల్లో స్థిరపడ్డామని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అమెరికాలో పెద్దఎత్తున తెలుగు ప్రజలు తమ ఆందోళన వ్యక్తం చేశారు. న్యూజెర్సీలో చంద్రబాబుకు మద్దతుగా పెద్దఎత్తున నిరసనలో పాల్గొన్నారు. తెలుగుదేశం`జనసేన జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సైకో పోవాలి` సైకిల్ రావాలి, న్యాయం కావాలి` చంద్రబాబు విడుదల కావాలి అనే నినాదాలతో ప్రవాసాంధ్రులు కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ అమెరికా వీధుల్లో హోరెత్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ డిమాండ్ చేశారు.
