Skip to main content

Namaste NRI

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ముఖ్య‌ గ‌మ‌నిక‌

అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్‌ కజిన్‌ విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం ముఖ్య గమనిక. లావణ్య కథానాయిక. వేణు మురళీధర్‌ దర్శకుడు. శివిన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయికృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటి వరకు టచ్‌ చేయని ఓ వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాం. కథ, కథనాలు ఆద్యంతం ఉత్కంఠగా సాగు తాయి. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులనూ మెప్పిస్తుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కిరణ్‌ వెన్న, నిర్మాతలు: రాజశేఖర్‌, సాయికృష్ణ, దర్శకత్వం: వేణు మురళీధర్‌.వి.

Social Share Spread Message

Latest News