కార్తీక్ రాజు హీరోగా రూపొందుతున్న చిత్రం అధర్వ. మహేష్ రెడ్డి దర్శకుడు. సుభాష్ నూతలపాటి నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం చిత్రానికి ఆకర్షణగా నిలుస్తుంది. తప్పకుండా చిత్రం జనాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు. కార్తీక్ రాజు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారు. మేజర్, డి.జె.టిల్లు సినిమాకి సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాల స్వరాలు చిత్రానికి ప్రధాన బలం. మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోందని తెలిపాయి సినీ వర్గాలు. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్‌సింగ్ దుహాన్, కల్పిక గణేశ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)