చందు కోడూరి, చరిష్మా శ్రీకర్ జంటగా డ్రీమ్ జోన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ప్రేమలో. హీరో చందు కోడూరి స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజేశ్ కోడూరి నిర్మించారు. జనవరి 26న విడుద ల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శివాజీ రాజా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు చందు మాట్లాడుతూ నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. చాలా కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా పెద్ద గా పేరు తెచ్చుకోలేకపోయాను.అయినా ఇప్పుడు దర్శకుడిగా, కథానాయకుడిగా ఈ సినిమాతో వస్తున్నా. భావో ద్వేగభరితమైన ప్రేమకథ ఇది. ప్రతి ఒక్కరికి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రామ్.పి నందిగం, సంగీతం: సందీప్ కనుగుల, మాటలు: ఐ రవి, నిర్మాత: రాజేశ్ కోడూరి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు కోడూరి.